పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తుల రద్దీ, పవన్ పట్టుచీరల పంపిణీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రానికి శ్రావణ మాస నాలుగో శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ పవిత్ర సందర్భం నందు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 12 వేల మందికి ఐదు విడతలుగా పట్టుచీరల కానుకలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అరుదైన కానుకలను అందుకున్న మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.