విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడి నుంచి పది కోట్లు లూటీ
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు సృష్టించిన భయాందోళనల నడుమ ఓ వృద్ధుడి నుంచి పది కోట్ల రూపాయలు దోచుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. గురునానక్ కాలనీకి చెందిన విశ్రాంత ఇంజినీర్‌ను బెదిరించి నాలుగు విడతలుగా ఈ నగదు బదిలీ చేయించుకున్నారని అధికారులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో సత్వరమే స్పందించి ఏడు కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు.