గుట్పా ప్రాజెక్ట్ సాధన కోసం ఇందూరు జిల్లాలో నేత పాదయాత్ర
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా జాక్రాన్ పల్లి నుండి గుట్పా ఎత్తిపోతల ప్రాజెక్ట్ వరకు ఇందూరు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాదయాత్ర చేపట్టినట్లు Arvind Dharmapuri వెల్లడించారు. అర్గుల్, నారాయణపేట్, లక్ష్మాపూర్, మునిపల్లి ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగుతోందని పేర్కొన్నారు. జాక్రాన్ పల్లి రైతాంగానికి సాగునీరు అందించాలని కోరుతూ చేపట్టిన ఈ యాత్ర ద్వారా అన్నదాతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలిపారు.