మర్రిపాడు ఉదయగిరి రహదారిపై వర్షపు నీటితో నిండి మాగాణిని తలపిస్తున్న వైనం
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు మండల కేంద్రం నుంచి ఉదయగిరి వెళ్లే రహదారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రహదారి వంకను తలపించేలా ఉండటంతో పాటు కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచి మాగాణిలా మారుతోంది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.