రాష్ట్రంలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు విపత్తు నిర్వహణ హెచ్చరికలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Amaravati

రాష్ట్రంలో మంగళవారం వాతావరణం మారి పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు.