రైల్వే ట్రాక్ సమీపంలో యువతి మృతి ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
రిపోర్టర్: వెంకట్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో అస్సాం యువతి హిమశ్రీ బోరో అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు వేగవంతం చేసినట్లు విశాఖపట్నం ప్రభుత్వ రైల్వే పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ వెల్లడించారు. విశాఖ స్టేషన్లో సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి, ఎనిమిది ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. పోస్టుమార్టంలో గాయాలు గుర్తించి, తోటి ప్రయాణికులను ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.