సత్యప్రసాద్ నియామకంపై జగన్‌ను నిలదీసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
వైకాపా హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్‌కు మతిస్థిమితం లేదంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడటంపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అప్పట్లో జగన్ కోరిక మేరకే అజేయకల్లం లేఖ రాసి సత్యప్రసాద్‌ను నియమించారని ఆధారాలతో వెల్లడించారు. మద్యం కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా రూ.3,500 కోట్ల దోపిడీ జరిగిందని, ఈ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకే వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.