'పోలైన ఓట్ల కంటే తొలగించేవే ఎక్కువ': తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పెంపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad, Telangana
తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR) గడువును అక్టోబర్ 7 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. హైదరాబాద్ పరిధిలోని యాకత్‌పురా, మలక్‌పేట్ సహా 15 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే తొలగించే ఓట్లే ఎక్కువగా ఉన్నట్లు ముసాయిదాలో వెల్లడవడం తీవ్ర చర్చనీయాంశమైంది.