మంగళగిరిలో మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘన ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: Mangalagiri

మంగళగిరిలో మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడంతో యువ మహిళా క్రికెటర్లకు అద్భుతమైన వేదిక లభించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చిన లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువ క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకోవడానికి, పెద్ద కలలు కనడానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.