అమరావతిలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
రాజధాని అమరావతి పరిధిలోని అబ్బరాజుపాలెం వద్ద ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. సుధా, వెంకట్ జాస్తి క్యాంపస్ పేరుతో పన్నెండు ఎకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి వైద్య, సాంకేతిక రంగాల ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు.