విమాన ప్రయాణికులకు షాక్: మరింత ప్రియం కానున్న ఫ్లైట్ టికెట్లు
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
విమాన ఇంధన ధరల భారం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్ లో విమాన టికెట్ల ధరలు మరింత ప్రియం కావొచ్చని ఇండిగో సంస్థ సీఈఓ విల్లీ వాల్ష్ సోమవారం స్పష్టం చేశారు. ఎయిర్లైన్స్ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేందుకే ఈ ధరల పెంపు అనివార్యమని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా రిఫైనింగ్ సామర్థ్యంలో తలెత్తిన అంతరాయాల వల్లే జెట్ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగినట్లు ఆయన వివరించారు.