గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే జగదీశ్వరి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుమ్మలక్ష్మీపురం
గుమ్మలక్ష్మీపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. చెముడుగూడ గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. జడ్పిటిసి పాలక క్రాంతి కుమార్ తో పాటు ఎంపిటిసి అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేశారు. గ్రామాలు అభివృద్ధి బాట పట్టాలంటే కూటమి నాయకుల గెలుపు ఎంతో కీలకమని ఆమె స్పష్టం చేశారు.