చింతపల్లిలో దారుణం: మద్యం కోసం డబ్బులివ్వలేదని ఐదు నెలల పసికందు హత్య

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గొల్లూరు చందు అనే వ్యక్తి మద్యం మత్తులో ఐదు నెలల పసికందును గొంతు నులిమి హత్య చేసినట్లు బంధువులు ఆరోపించారు. మద్యం, గంజాయి తాగేందుకు భార్య రూ. వంద నిరాకరించడంతో ఈ దురాఘాతానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.