అల్లూరి జిల్లాలో అమానుషం: వంద రూపాయల కోసం కన్న కొడుకును పొట్టనబెట్టుకున్న తండ్రి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మద్యానికి బానిసైన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. మద్యం కొనుగోలు చేయడానికి వంద రూపాయలు ఇవ్వాలని కోరగా భార్య నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి చందు ఐదు నెలల పసికందు గొంతు నులిమి హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.