పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు

రిపోర్టర్: అశోక్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ శీలం రామకోటారెడ్డి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపొందించడమే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను మహావృక్షంగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.