చెరువును తలపిస్తున్న రాచపల్లి రోడ్డుతో నరకం చూస్తున్న కాలనీవాసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలం పరిధిలోని సి.ఎం. రాచపల్లి అరుంధతి వాడలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన మురుగు కాలువలు లేకపోవడంతో ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. రాకపోకలకు విద్యార్థులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దోమలు ప్రబలి విషజ్వరాలు వస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.