టాలీవుడ్లో తీవ్ర విషాదం సీనియర్ డైరెక్టర్ కన్నుమూత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఎస్ఎస్ రవిచంద్ర వయసు 84 హైదరాబాద్లో కన్నుమూశారు. ఈయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు. హీరో కృష్ణ, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. నేడు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.