ఓట్ల నమోదులో అదరగొట్టిన రాజాపేట బీఆర్ఎస్ నేతలకు జగదీశ్వరరెడ్డి ప్రశంసలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ చూపుతున్న చొరవపై మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి మండల అధ్యక్షులు సట్టు తిరుమలేష్ను ప్రత్యేకంగా అభినందించారు. వెయ్యి ఓట్ల లక్ష్యంతో ఉన్న మండలంలో పార్టీ శ్రేణుల సహకారంతో అత్యధికంగా ఓట్లు నమోదు చేయించడం పట్ల నియోజకవర్గంలోనే ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు.