గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజును కలిసిన మజ్జి శ్రీనివాసరావు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

వైకాపా నుంచి తెదేపాలో చేరిన విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. గోవాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తెదేపాలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న తరుణంలో, ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దల సూచనలతో ముందుకు సాగుతానని శ్రీను స్పష్టం చేశారు. ఈ భేటీలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా పాల్గొన్నారు.