హైదరాబాద్‌లో ఘనంగా కాసు సినిమా గ్లింప్స్ లాంచ్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
యువ నటుడు శ్రీనందు హీరోగా నటిస్తున్న కాసు సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర నిర్మాత ఏఎం రత్నం ముఖ్య అతిథిగా విచ్చేశారు. డబ్బు జబ్బుగా మారితే పర్యావసానం ఎలా ఉంటుందో ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరిస్తుందని హీరో శ్రీనందు పేర్కొన్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.