వసతి గృహాల్ లో ఆకస్మిక తనిఖీలు: విద్యార్థుల సమస్యలపై సివిల్ జడ్జి ఆరా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
గంట్యాడ మండలం లోని బాలికల పాఠశాల, బీసీ బాలుర వసతి గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. వసతి గృహాల్ లో మౌలిక వసతులు, భోజన నాణ్యత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణతో చదవాలని సూచించారు.