చిత్తూరు జిల్లాలో భార్యాపిల్లలు లేని జీవితం వద్దు అంటూ వ్యక్తి ఆత్మహత్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: చిత్తూరు
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర రావు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాపిల్లలు లేని జీవితం నాకు వద్దు అంటూ వాయిస్ మెసేజ్ పంపి మామిడి తోటలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.