దేశంలో జనగణన రెండో దశ షెడ్యూల్ విడుదల: కులగణనపై కేంద్రం కీలక ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

దేశంలో జనాభా లెక్కల సేకరణకు సంబంధించి రెండో దశ షెడ్యూల్ను భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయకుమార్ నారాయణ్ వెల్లడించారు. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2027 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు రెండో దశ జనాభా లెక్కలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో కులగణనతో పాటు మొత్తం నలభై ప్రశ్నలతో సున్నితమైన అంశాలపై వివరాలు సేకరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.