చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా
రిపోర్టర్: BHARADWAJ
స్థలం: మునగాల
సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతంలో ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఘనంగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రుల పూజల అనంతరం పదవ రోజున పండుగ జరుపుకుంటామని, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజు విజయానికి చిహ్నమని ఆయన వివరించారు. పాండవులు జమ్మి చెట్టుపై ఆయుధాలు దాచిన రోజుగా ఇది ప్రసిద్ధి చెందిందని పేర్కొంటూ ప్రజలందరికీ ఆయన ఆనందకరమైన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.