పల్లెటూర్ల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఇందుకూరుపేట
గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణతోపాటు పల్లెల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె పండుగ కింద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. డిసెంబరు 1 నుంచి అర్హులందరికీ కొత్త పింఛన్లు అందిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.