ఎలాన్ మస్క్కు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు గట్టి కౌంటర్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

భారత్లో స్టార్లింక్ సేవలు మరియు డేటా ధరలపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు డేటా లభిస్తున్న దేశం భారత్ అని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని ఎలాన్ మస్క్కు ఆయన ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇస్తూ హితవు పలికారు.