స్పామ్ సందేశాలు మరియు ప్రమోషనల్ కాల్స్‌పై కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లకే కాకుండా సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్ యాప్‌లు, పుష్ నోటిఫికేషన్‌ల ద్వారా వచ్చే అవాంఛిత వాణిజ్య సందేశాలు, స్పామ్ కమ్యూనికేషన్లను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్న ఈ ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలు కృత్రిమ మేధస్సు, వ్యక్తిగత డేటా వినియోగం మరియు డిజిటల్ మాధ్యమాలపై నిఘాను మరింత కఠినతరం చేయనున్నాయి.