తీవ్ర తుఫాను ముప్పు: తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.