బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయితే ఆందోళన చెందవద్దని తెలిపిన ఎస్పీ

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

సైబర్ నేరాల దర్యాప్తు మరియు ఇతర సాంకేతిక కారణాలతో బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయితే బాధితులు ఏమాత్రం ఆందోళన చెందకూడదని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్పష్టం చేశారు. వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించి ఫ్రీజ్ కావడానికి గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు. లావాదేవీల రసీదులు, యూపీఐ వివరాలను దర్యాప్తు అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. ఖాతా అన్ఫ్రీజ్ చేస్తామని చెప్పే మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని చిత్తూరు జిల్లా ప్రజలను ఎస్పీ హెచ్చరించారు. బాధితులు 1930 నంబరును సంప్రదించాలన్నారు.