ఫార్మారంగ అభివృద్ధికి ఏపీ ప్రధాన కేంద్రమంటూ మంత్రి లోకేశ్ వెల్లడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అహ్మదాబాద్

ఫార్మారంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్లో గుజరాత్ పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫార్మా, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ పారిశ్రామికవర్గాలను కోరారు. విశాఖ భాగస్వామ్య సదస్సు సన్నాహకాల్లో భాగంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.