మొబైల్ యూజర్లకు షాక్: త్వరలో భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

మొబైల్ రీఛార్జ్ ధరలను మరో పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు పెంచేందుకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు సిద్ధమవుతున్నట్లు బిజినెస్ బ్యూరో వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఐదుజీ నెట్వర్క్ విస్తరణ, నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రతి వినియోగదారుడిపై ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతోనే ఈ టారిఫ్ పెంపుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు ఈ తాజా టారిఫ్ పెంపు అదనపు ఆర్థిక భారంగా మారుతుందని తెలిపారు.