ఆకుతోటపల్లిలో క్రషర్ మైనింగ్ అనుమతులు నిలిపివేయాలని గ్రామస్థుల ఆందోళన

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆకుతోటపల్లి క్రషర్ మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని కోరుతూ విక్టరీ యూత్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ నాయకుడు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, మైనింగ్ వల్ల పర్యావరణానికి, స్థానిక ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.