బుచ్చిరెడ్డిపాళెంలో నూతన ఉప ఖజానా కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

నియోజకవర్గంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఉప ఖజానా కార్యాలయ భవనాన్ని సోమవారం స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవన సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారా దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యాలయం ద్వారా నాలుగు మండలాల ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థిక లావాదేవీల సేవలు పారదర్శకంగా అందుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.