ఇజ్రాయెల్ ప్రధాని మేకప్ ఖర్చులు రూ.4.49 కోట్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: World
ఇజ్రాయెల్‌లో 2019 నుంచి ఇప్పటివరకు ప్రధాన మంత్రుల హెయిర్ స్టైలింగ్, మేకప్, దుస్తుల కోసం రూ.4.49 కోట్లు ఖర్చయినట్లు పీఎంవో వెల్లడించింది. ఈ మొత్తం ఖర్చులో 90 శాతం ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా కేశాలంకరణ కోసమే వెచ్చించినట్లు తేలింది. యుద్ధ సమయంలోనూ భారీగా నిధులు ఖర్చు చేయడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.