శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం: ప్రయాణికుడి వద్ద బుల్లెట్ గుర్తింపు

రిపోర్టర్: సునీల్ స్థలం: రంగారెడ్డి

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగు చూసిందని భద్రతా సిబ్బంది తెలిపారు. భద్రతా తనిఖీల్లో భాగంగా అతడి వద్ద బుల్లెట్ ఉన్నట్లు గుర్తించిన వెంటనే అప్రమత్తమయ్యామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించామని అధికారులు స్పష్టం చేశారు.