బురుజుబావిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుండాల
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బురుజుబావి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శనివారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.