ఎన్నికల సంఘం తీరుపై బీఆర్ఎస్ నేతల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మరియు ఎస్ఐఆర్ అంశాలపై తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డూ, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రధాన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.