ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఆయన సతీమణి నిష్టాశర్మ గౌరమ్మకు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, కోలాటాలు ఆడి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.