పేదలకు తీపి కబురు: రాష్ట్రంలో మరో ఐదు నగరాలకు ఇందిరమ్మ టవర్స్ విస్తరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

తెలంగాణలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్ లో అమలవుతున్న ఇందిరమ్మ టవర్స్ను మరో ఐదు నగరాలకు విస్తరించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏకంగా రెండు వేల నాలుగు వందల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.