దమ్ముంటే బుల్లెట్ బైక్పై రండి: వైసీపీ నేతలకు పులివర్తి నాని సవాల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: చంద్రగిరి

చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే పులివర్తి నాని వైఎస్సార్సీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. తాను బుల్లెట్ బైక్పై ప్రజల్లోకి వెళ్తానని, బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా తిరిగే ధైర్యం విపక్ష నేతలకు ఉందా అని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. డ్రామాలు మాని నేరుగా జనంలోకి రావాలని ఆయన తేల్చిచెప్పారు.