పేదల పాలిట సంజీవనిగా మారిన ముఖ్యమంత్రి సహాయనిధి
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు రూరల్
నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గురువారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 50 మంది బాధితులకు రూ.46 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నియోజకవర్గంలో రెండున్నరేళ్లలో 1041 మందికి రూ.9.30 కోట్లు అందించామని తెలిపారు. ఇంకా వందల దరఖాస్తులు ప్రాసెసింగ్ లో ఉన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దమనస్సుతో పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.