'దసరా సెలవులు ఎప్పుడంటే..': తెలంగాణ విద్యార్థులకు కీలక షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మొదటి సమ్మెటివ్ అసెస్‌మెంట్ (SA-1) పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరగనుండగా, పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్ 10 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు దసరా పండుగ సెలవులు ఖరారయ్యాయి. తరగతుల వారీగా వేర్వేరు సమయాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.