కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ వైద్య సేవలు త్వరలో ప్రారంభం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కాకినాడ
కాకినాడ జీజీహెచ్‌లో క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.36.65 కోట్లతో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ అలాగే సీటీ స్కాన్ ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ పరికరాల ఏర్పాటుకు ఓఎన్జీసీ ముందుకొచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా పరికరాలు ఏర్పాటు చేసి రోగులకు ఆధునిక చికిత్సలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.