మీడియా గొంతు నొక్కడం చంద్రబాబు పిరికితనానికి నిదర్శనం: ఆర్కే రోజా
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తున్న మీడియా సంస్థల సోషల్ మీడియా ఖాతాలను కూటమి ప్రభుత్వం బ్లాక్ చేయించడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. ఇది చంద్రబాబు పిరికితనానికి, అసహనానికి నిదర్శనమని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, డీఎస్సీ అభ్యర్థుల కోసం, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆపేది లేదని, వెంటనే ఆంక్షలు తొలగించాలని రోజా డిమాండ్ చేశారు.