చిరుధాన్యాల వంటకాలతో ఆరోగ్య రక్షణ.. పాముకుంట అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార ప్రదర్శన!

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని పాముకుంట అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాల సందర్భంగా గురువారం తల్లుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రంగ నరేష్ గౌడ్ మాట్లాడుతూ తల్లులందరూ పిల్లలకు చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాలు చేసి పెట్టాలని, ప్రకృతి సిద్ధ ఆకుకూరలను వాడాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణ మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారపాక కరుణాకర, నీల బాలయ్య, వార్డు సభ్యులు, తల్లులు పాల్గొన్నారు.