మంత్రి నారా లోకేశ్‌ను ప్రశంసించిన చాగంటి కోటేశ్వరరావు

రిపోర్టర్: నరేష్ స్థలం: కాకినాడ

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రశంసల వర్షం కురిపించారు. కాకినాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చాగంటి, మంత్రి లోకేశ్‌లోని నిబద్ధతను, ఆయన వైఖరిని ప్రత్యేకంగా కొనియాడారు. నేటి తరం విద్యార్థుల్లో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, దేశభక్తి, సాంస్కృతిక విలువలను నింపాలనే అపూర్వమైన తాపత్రయం విద్యాశాఖ మంత్రిగా లోకేశ్‌లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.