కేతరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార అవగాహన ఉత్సవం

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

పుల్లంపేట మండలం కేతరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఉత్సవంలో గర్భిణులు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు. కార్యకర్త సరోజనమ్మ మాట్లాడుతూ ఐసీడీఎస్ ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పాలు, గుడ్లతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.