వైసీపీ అంటేనే కుళ్ళు కుతంత్రాలుగా మారిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపాటు

రిపోర్టర్: సతీష్ స్థలం: మచిలీపట్నం

వైసీపీ అంటేనే కుళ్ళు కుతంత్రాలుగా మారిపోయిందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం జిల్లా ప్రతిష్ఠను పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగిస్తున్న తమపై రాజకీయ కక్షతోనే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ వర్గాలు ఎదురుదాడికి దిగుతున్నాయి.