'ఫుడ్ స్టాల్స్‌కు ఒకన్యాయం.. గోదాములకు మరోన్యాయమా?': కుత్బుల్లాపూర్‌లో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ పరిధిలో రాత్రివేళ ఫుడ్ స్టాల్స్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా పోలీసులు వెంటనే సుమోటో కేసులు నమోదు చేస్తుండగా, ఫాక్స్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో బయోమెడికల్ వ్యర్థాలు దగ్ధమై కాలుష్యం వెలువడిన ఘటనలో మాత్రం కేసు నమోదుకు గంటల తరబడి జాప్యం చేయడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనల అమలులో పోలీసులు అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి, కేసుల నమోదులో ఆలస్యంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.