నిరుద్యోగులకు ఉపాధి అవకాశం: నిజామాబాద్ రూరల్లో యువతీ యువకుల వివరాల సేకరణ
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలతో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నిరుద్యోగ యువతీ యువకుల వివరాల సేకరణ ప్రారంభమైంది. ఆన్ లైన్ పోర్టల్లో నమోదు చేసి శిక్షణ కల్పిస్తామని గ్రామ సర్పంచ్ వరలక్ష్మి సంతోష్ తెలిపారు. అర్హులు ఆధార్ కార్డుతో పంచాయతీ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని వారు సూచించారు.